![]() |
![]() |

బుల్లితెర మీద సుహాసిని ఒక వెలుగు వెలుగుతోంది. దేవత సీరియల్ తో ఆమె మంచి ఫేమస్ అయ్యింది. చంటిగాడు మూవీతో ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సుహాసిని రీసెంట్ గా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇలా జవాబిచ్చింది. "అక్కా నీ నవ్వు చాలా బాగుంటుంది ఇలా ఎలా మెయింటైన్ చేస్తావ్" అనేసరికి నవ్వుతూ ఉన్న ఒక పిక్ ని పోస్ట్ చేసింది. "మేమంతా బుల్లి సుహాసిని కోసం వెయిటింగ్ అక్కా" తొందరలోనే వస్తుంది అంటూ ఆన్సర్ ఇచ్చింది. "మీ నేటివ్ ఎక్కడ" "ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు" అని చెప్పింది.
"మీ భర్తతో కలిసి ఒక సీరియల్ చేయొచ్చు కదా" అని అడిగారు. "సరే తప్పకుండా" అని చెప్పింది. "మీరు ఏమైనా మూవీస్ చేస్తున్నారా" అని అడిగారు "లేదండి ప్రస్తుతానికి మూవీస్ చెయ్యట్లేదు, సీరియల్స్ , ప్రోగ్రామ్స్ అంతే" అని చెప్పింది. "లక్ష్మి కళ్యాణం నుంచి ఇప్పటి వరకు మీ నవ్వులో ఎలాంటి మార్పు లేదు" అంటూ కితాబిచ్చారు. "హలో అక్కా మేము మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ 9 లో చూడాలని ఉంది" అని అడిగారు. "థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ " అని చెప్పింది. ఇక ఫైనల్ గా ఇలాంటి ఫాన్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. లక్ష్మి కళ్యాణం, అడ్డా, దోస్త్ సహా దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే ఈమె తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ లో కూడా నటించింది. జెమినీ టీవీలో అపరంజి సీరియల్ ద్వారా పరిచయమయ్యింది. ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మను లవ్ మ్యారేజ్ చేసుకుంది.
![]() |
![]() |